Monday, April 13, 2020

శిరీష మణిపూసలు

శిరీష మణిపూసలు
రచన :-
ఆరేటి శిరీష
9వ, తరగతి
ZPHS గుఱ్ఱాలగొంది, 
సిద్దిపేట జిల్లా


గురువు :- 
శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
గుఱ్ఱాలగొంది, సిద్దిపేట జిల్లా

వివిధ మణిపూసలు
1.
ఉదయము నిద్ర లేచితిని
పండ్లు బాగా తోమితిని
అమ్మ చాయి పోయ గాను
చక్కగ నేను తాగితిని
2.
స్నానం చేసి వచ్చాను
ఉతికిన బట్టలేశాను
స్నేహితులను కలుసుకొని
త్వరగా బడికి పోయాను
3.
ప్రార్థన గంట కొట్టారు
బడికి అందరు వచ్చారు
ప్రతిజ్ఞ మేము చేయగా
తరగతి గదికి వెళ్లారు.
4.
పాఠము సారు చెప్పారు
శ్రద్ధగ బాలలిన్నారు
సారు బయటకు వెళ్లగను
ముచ్చట్లంత పెట్టారు
5
ఆదివారం వచ్చింది
ఆనందాన్ని తెచ్చింది
త్వరగ ఇంటికి రాకుంటె
అమ్మ మమ్ముల తిట్టింది.
6.
అమ్మమ్మ వచ్చింది
పండ్లెనే తెచ్చింది
అందరము తిన్నాము
బలము మాకు వచ్చింది.
7.
బడికి పోయి వచ్చినాను
బ్యాగు పక్కకు పెట్టాను
కాళ్ళు చేతులు కడిగుకొని
అన్నము నేను తిన్నాను
8.
మంచి చదువులు చదివాను
పరీక్ష లన్ని రాశాను
పేపర్లన్ని  దిద్ధగా
మార్కు లెన్నో పొందాను
9.
ఉదయం నిద్ర లేచాను
పుస్తకమునే పట్టాను
పాఠము లన్ని చదివాక
ఇంటి పనులను చేశాను
10.
హోంవర్కును చేశాను
ఆటలన్ని ఆడాను
రాత్రి బాగా చదువుకొని
నిద్రనేను పోయాను.

వివిధ మణిపూసలు
11
గడ్డపార పట్టాను 
అర్థగజం తవ్వాను 
మొక్కలను తెచ్చుకొని 
గుంతల్లో పాతాను
12
ట్రీగార్డును పెట్టాను
నీరు చాల పోశాను 
మొక్కపెరుగుచుండగ
కొమ్మ లెన్నో వేసెను
13
కొమ్మ నిండ పువ్వులు
చెట్టు నిండ ఫలములు
తెంపి సంత లమ్మగ
మనకేమొ లాభాలు
14
చెడు గాలిని పీల్చును
మంచి గాలి నిచ్చును
చెట్ల వలన వర్షాలు 
నేలపైన కురియును
15
చెట్లు తగ్గు చుండెను
కరువు మనకు వచ్చెను
తాగు నీరు దొరకక 
ఎండ వేడి పెరిగెను
16.
చదువు  నాకు వచ్చింది
తెలివి కొంత పెరిగింది
అందరు నన్ను మెచ్చారు
మంచి కొలువు వచ్చింది
17
సిద్దిపేటకు వెళ్ళాను
సైకిలు నేను కొన్నాను
బస్సుల దాన్ని వేసుకొని
ఇంటి దగ్గర దిగినాను
18
పుస్తకాలు సర్దనం
సైకిలుకే వేసినం
చెల్లి నేను తొక్కు కుంట
బడికి మేము వెళ్లినం
19.
పెన్ను చేత పట్టాను
మంచి రాత రాశాను
గుండ్రంగా వచ్చినంక
చూసిన సారు మెచ్చెను
20
ఊరికి నేను వెళ్ళాను
చుట్టాలనూ కలిశాను
సరదా ఆటలాడుకొని
ఆనందంగ గడిపాను.

*వివిధ మణిపూసలు*
21
పేద రైతుగ పుట్టాడు 
కష్టాలనుభవించాడు 
పెద్ద చదువుల కోసము
వేరే పట్నము పోయిండు
22
తెలగాణన కవుల్లేరు
మాటను తిప్పికొట్టారు 
నిరూపించుకోడానికి 
పల్లె పల్లెను తిరిగారు
23
తెలగాణ వైతాళికుడు 
గోల్కొండను పత్రికతడు 
నడిపాడు ప్రతాపరెడ్డి
ధైర్యాన్నే నొడ్డియతడు
24
సిగ్నల్స్ ను పాటించండి 
బైకు మెల్లగ నడపండి 
నాలాలు గమనించిన 
ప్రమాదాలు జరుగవండి
25
ఊరికి నేను వెళ్లాను 
చుట్టాలనూ కలిశాను
అల్లరెంతో చేసియు
కొంటె పనులను మానాను
26
ఉదయం నిద్ర లేచాను 
యోగ బాగా చేశాను
సోమరితనము పోగాను
ప్రశాంతంగా ఉన్నాను
27
సిరిసిల్లకే వెళ్ళాను
బట్టల షాపు పోయాను 
మంచి డ్రెస్సులు తీసుకొని 
డబ్బులు కట్టి వచ్చాను
28
ప్లాస్టికును వాడవద్దు 
కాలుష్యం చేయొద్దు 
ప్రాణహాని తెచ్చుకొని 
హాస్పిటల్లొ పడవద్దు 
29
ఇటుకలనన్ని తెచ్చాము
సిమెంటు ఇసుక కలిపాము
మేస్తిరీని పిలిపించి 
ఇటుకగోడ కట్టాము
30
సంట్రింగ్ చెక్క కొట్టాము
పైన సలాక పరిచాము
మాలు బాగా గలిపియు
పోయ స్లాబు నిర్మాణము

*అమ్మ మణిపూసలు*
31
తొమ్మిది నెలలు మోసింది 
అమ్మ ప్రాణం పోసింది 
నాకు జన్మ నిచ్చాక
సుద్దు లెన్నో నేర్పింది
32
కష్టాలు అనుభవించెను
గావు రంగ నను పెంచెను
బిడ్డ పైకి ఎదగాలని 
పగలు రాత్రి కష్టించెను
33
అమ్మ ప్రేమ గొప్పది 
సృష్టిలో తీయనిది 
సాటి లేరుఆమె కెవరు
ఎంత ఓర్పు ఉన్నది 
34
ఫోటు రాయి తగిలింది 
రక్తమంత కాలింది
అమ్మ మనసు విలవిల 
తల్లడిల్లుచు ఉన్నది
35
అంబులెన్సు వచ్చెను
ఆసుపత్రికెళ్ళెను
బిడ్డ మంచిగుండాలని
డాక్టర్లను వేడెను.

*వివిధ మణిపూసలు*
36
రైతు నిద్ర లేచాను 
బాయికాడికెళ్ళెను 
బోరు మోటరేసుకుని 
పొలమునంత తడిపెను
37
ఎడ్ల తోలు కొచ్చెను 
నాగలికవి కట్టెను
పొలం నంత దున్నినంక 
కొట్టములో తోలెను 
38
ఎడ్లకు నీళ్లను పోసెను
పచ్చి గడ్డి ముందేసెను
కడుపునిండ తినినంక 
నెమరును వేయుచు నుండెను
 39
ఊరు వెళ్లి కూలీలను
వెంట తీసుకొనివచ్చెను
వరినాట్లు వేయించి 
వారిని ఇంటికి  పంపెను
40
కంటిమీదనిద్రను
రోజు పోక పోయెను 
పంట ఎట్లు పండునని 
రోజు దిగులు గుండెను
41
దేవుడు కరుణించెను 
పంట చేతికొచ్చెను
రైతుఇంట సంబరాలు 
ఆకాశం చేరెను

*వివిధ మణిపూసలు*
42
రేపు జెండా పండుగ 
నేడు ఇంటికి వెళ్లగ
అమ్మ గోరింటాకు దెచ్చి 
చేతులకేమొ పెట్టెగ
43
నేనునిద్రను లేచాను
గోరింటాకు కడిగాను
చేతులుఎర్రబడగ
చూసి నేనే మురిశాను
44
తలస్నానము చేశాను 
కొత్త డ్రెస్సు వేశాను 
స్నేహితులను కలుసుకుని 
పాఠశాల కేగాను 
45
జాతీయ జెండపట్టి
నేతలకే జై కొట్టి
నినాదాలు చేయుచు 
పిల్లలు జంటలు పట్టి
46
పాటలెన్నొ పాడుకుంటు
వీధి వీధి తిరుగుకుంటు 
జెండాలెగురవేసియు
తిరిగి బడికి నడుచుకుంటు
47
హెచ్.యం. గారు వచ్చారు 
జెండా ఎగురవేశారు 
జాతీయగీతం పాడి 
అందరూ కూర్చున్నారు
48
ప్రధానోపాధ్యాయులు 
అధ్యక్షుని తొలిపలుకులు 
పలికినారు ముందుగా 
చెప్పెను శుభాకాంక్షలు
49
భారత రాజ్యాంగమును 
అమలులోనికివచ్చెను 
హక్కులు,బాధ్యతలన్ని
మనకు గుర్తుకు జేసెను
50
సమావేశమయ్యెను
లడ్డు మిఠాయిచ్చెను 
తినుకుంటు పిల్లలంత
ఇంటి దారి పట్టెను

*వివిధ మణిపూసలు*
51
ఫిబ్రవరి వచ్చింది 
శివరాత్రి తెచ్చింది 
శివలింగం పూజించగ
భక్తియే పెరిగింది 
52
శివుని పూజ చేశాను 
చిక్కు లెన్నో తొలగెను 
కొబ్బరికాయ కొట్టగ
మొక్కు లెన్నో తీరెను
53
రాత్రంతను జాగారము
భక్తి పాటలు పాడాము 
పొద్దున్నే దేవుని గుడి 
అందరెళ్ళి వచ్చినాము
54
గోగుపువ్వుతెచ్చినాము
శివునికి అర్పించినాము
మంచి చదువు రావాలని
భక్తి తోడ మొక్కినాము
55
అర్ధనారీశ్వరుడు 
త్రిశూల దారి యతడు 
లోకాలను కాపాడే
మూడు కన్నుల వాడు

*గాలిపటం మణిపూసలు*
56
దుకాణముకు వెళ్లాను 
గాలిపటము కొన్నాను 
దారమును కట్టుకొని 
భవనము పైకెక్కాను
57
పైకి ఎగురవేశాను
అటూ ఇటూగుంజాను
చాలా దూరమెళ్లగాను
దారమే తెగిపోయెను
58
దూరంగా వెళ్ళింది 
చెట్టుమీద చిక్కింది 
గాలి బాగ వీచంగ
బావిలోనా పడింది
59
చాల బాధపడ్డాను 
ఇంటికి తిరిగొచ్చాను 
అమ్మ కేమొ చెప్పగా 
మరొ పతంగి కొనిచ్చెను
60
గాలిపటాలు విడువాలి
జాగ్రత్త పాటించాలి 
చీకటి కాకముందే 
ఇంటికి మనము చేరాలి

*వివిధ మణిపూసలు*
61
గురువు ప్రేమ గొప్పది 
అమ్మ ప్రేమ గొప్పది
ఇద్దరు ముఖ్యమనియు 
తెలిసెటట్లు చెప్పింది
62
వేసవి కాలమొచ్చెను
ఉబ్బర మెక్కువాయెను
ఐస్ క్రీమును తినినంత
జబ్బు లెన్నో వచ్చెను
63
ఆసుపత్రి వెళ్ళాను 
డాక్టరు గారు తిట్టెను
ఐస్క్రీమ్ తినవద్దని
నీతి మాటలు చెప్పెను
64
ఎండలోన తిరుగకు 
కొంటె ఆటలాడకు
వడ దెబ్బ తగిలినచో 
ప్రాణహానియు నీకు 
65
నీడపట్టునుండుము
నీళ్లుచాలతాగుము
చిన్న పొట్టి ఆటలెన్నొ
ఇంటిలోన ఆడుము
66
వర్షాకాల మొచ్చెను 
వర్షాలను తెచ్చెను 
చెరువులన్ని నిండగా 
బావుల నీరొచ్చెను
67
చెట్లన్ని చిగురించెను
నేలతల్లియె మురిసెను 
ప్రకృతి పచ్చదనమై
పండ్లు కాయలు ఇచ్చెను
68
చలి కాలం వచ్చింది 
చలి నెంతో తెచ్చింది 
ఊరు చుట్టూ మంచునంత 
కమ్ముకొనియువచ్చింది
69
కట్టెలన్ని తెచ్చాము 
అందరినే పిలిచాము
మంట బాగ పెట్టుకొని
చలిని వెళ్ళగొట్టాము
70
స్వెట్టరును  వేసుకొనుము 
వెచ్చ యగును శరీరము 
హాయిగా పనులనన్ని 
చక్కగ చేసుకోనుము

*వివిధ మణిపూసలు*
71
సంక్రాంతి వచ్చింది 
సరదాలు తెచ్చింది 
రైతు పంట పండించ
ఇంట్ల వచ్చి చేరింది.
72
ఇంటిముందు హరిదాసులు 
మధురమైనవి కీర్తనలు 
పాడుతుంటె జనులకు 
భక్తి తోడ సంబరాలు
73
గంగిరెద్దులొచ్చాయి
ఆటలెన్నొఆడాయి
భిక్షము వేయగానె
దీవెనలు ఇచ్చాయి
74
పొద్దుపొద్దున లేచాము 
కొత్తబట్టలు కట్టాము 
దేవుని గుడికి వెళ్లి 
కానుకలు అర్పించాము
75 
ముంగిటిలోముగ్గులు
ముగ్గు నిండు రంగులు 
రంగులన్ని నింపియు 
నడుమన గొబ్బెమ్మలు
76
నవధాన్యాలు  పోశాము
భక్తి తోడ మొక్కినాము
సంక్రాంతి లక్ష్మి నేమొ
ఇంటిలోకి పిలిచినాము
77
ముగ్గులు ముందు సెల్ఫీలు 
వాట్సాపులో ఫోటోలు 
పెట్టినంక కామెంట్లు 
రాగ మాకు సంబురాలు 
78
మట్టి గణపతి పెట్టండి 
ఊరి మధ్యలో నిల్పండి
పెద్ద గణపతి పెట్టిన
చెరువే కాలుష్యమండి
79
చిన్న గణపతితేవాలి 
భక్తిగ పూజ చేయాలి 
తక్కువ ఖర్చు పెట్టండి 
డబ్బులు పొదుపు చేయలి
80
డీజె ఖర్చులు మానండి 
మద్యపానముమానండి
భజన చేసుకుంట పోయి 
చెరువులోన వేసి రండి

రచన :-
ఆరేటి శిరీష
9వ, తరగతి
ZPHS గుఱ్ఱాలగొంది, 
సిద్దిపేట జిల్లా

గురువు :- 
శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
గుఱ్ఱాలగొంది, సిద్దిపేట జిల్లా